అక్షయ్‌ కుమార్‌ కొత్త చిత్రం ‘రక్షాబంధన్’‌

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించే చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయి. అందుకు నిదర్శనం ఆయన గతంలో నటించిన సినిమాలే ఉదాహరణ. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు పోస్టర్ని సైతం ట్విట్టర్లో షేర్‌ చేశారు. అక్షయ్‌ ‘రక్షాబంధన్’‌ అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిమాన్షు శర్మ కథను అందిస్తున్నారు. ఎ ఎల్లో ప్రొడక్షన్స్, కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వచ్చే ఏడాది నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. నలుగురు చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న పోస్టర్ని అక్షయ్‌ షేర్‌ చేస్తూ..‘‘ఈ చిత్రం మీ హృదయ లోతుల్ని తడిమి చూస్తుంది. నా సినీ జీవితంలోనే ముఖ్యమైనది. అందుకే వెంటనే నటించడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రాన్ని నా సోదరి అల్కాకు అంకితం. ప్రపంచంలోని సోదరిసోదరులకు నా ధన్యవాలు..’’అంటూ పేర్కొన్నారు. అక్షయ్‌ కుమార్‌ గత ఏడాది నాలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. వాటిలో ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్’‌, ‘హౌస్‌ఫుల్‌4’, ‘గుడ్‌న్యూజ్’‌లాంటి ఉన్నాయి. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ఇప్పటికే ఐదు చిత్రాలతో బిజీగా ఉన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.