రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - అర్జున్‌ కపూర్ల కొత్త చిత్రం!

ఇప్పుడు బాలీవుడ్‌ల్లో హీరోలే నిర్మాతలుగా మారుతూ కొత్త చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. అలాంటి కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు నటుడు జాన్‌ అబ్రహాం. ఇటు దక్షిణాదిలోనూ అటు బాలీవుడ్‌లోనూ సత్తా చూపుతున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వైవిధ్యమైన కథలతో వస్తున్న నటుడు అర్జున్‌ కపూర్లతో కలిసి జాన్‌ అబ్రహాం చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఇదొక రొమాంటిక్‌ ప్రేమకథా నేపథ్యంలో ఉంటుందట. జాన్‌ అబ్రహం, మరో నిర్మాతలైన భూషణ్‌ కుమార్‌, నిఖిల్‌ అడ్వాణిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైయ్యారట. జాన్‌ ఈ ఇద్దరు నిర్మాతలతో కలిసి గతంలో బాట్లహౌస్‌ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాని పంజాబ్‌లో కొంత భాగం, అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ షూటింగ్‌ జరపనున్నారట. ఇందులో అర్జున్‌ - రకుల్‌ ప్రీత్‌ల పాత్రలు చాలా కొత్తగా కనిపించనున్నారట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పేరును, విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారని సీన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌ పానిపట్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రకుల్‌ ప్రస్తుతం కమల్‌తో కలిసి భారతీయడు2, మరో తమిళం చిత్రంలో నటిస్తుంది. అంతేకాక హిందీలో మార్జావాన్‌ చిత్రంలోనూ నటించింది. ఈ చిత్రం నవంబర్‌ 8, 2019న తెరపైకి రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.