రానా స్థానంలో శరద్‌ కేల్కర్‌!

అజయ్‌ దేవగణ్‌ హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. తొలుత టాలీవుడు నటుడు రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకారం కూడా తెలిపాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడే అదే పాత్రలో నటుడు, మోడల్‌ శరద్‌ కేల్కర్‌ చేయనున్నాడు. ఈ అంశాన్ని అధికారింగా చిత్రబృందం ప్రకటించింది. ఈ అవకాశం దక్కడంపై శరద్‌ స్పందిస్తూ..‘‘తాను చిన్నతనం నుంచి ఆర్మీలో చేరాలని కోరిక ఉండేది. కానీ అది తీరలేదు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని’’ చెప్పాడు. చిత్రంలో శరద్‌ సైనికాధికారిగా నటించనున్నాడు. ఇప్పటికే సినిమాలలో ముందుగా అనుకున్న హీరోయిన్‌ పరిణీతి చోప్రా కూడా తప్పుకుంది. అదే స్థానంలలో నోరా ఫతేహి నటిస్తోంది. ఇంకా చిత్రంలో సంజయ్‌ దత్, సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్, ప్రణీత సుభాష్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14, 2020న తెరపైకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.