మొదటి ప్రపంచ కప్పు సంగతులు...

భారతదేశంలో రెండే మతాలున్నాయి, ఒకటి సినిమా.. రెండు క్రికెట్‌. యువతకి వినోదం పంచటానికి ఇంతకన్న ఎక్కువగా ఆకర్షించే అంశాలు లేవనే చెప్పాలి. అందులోను మొదటి ప్రపంచ కప్పు గెలిచిన సందర్భం అప్పటికి, ఇప్పటికి ప్రత్యేకమే. ఇప్పుడు ఆ ప్రపంచ కప్పు మధురానుభూతులన్ని వెండితెరపై పునరావిష్కరిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా మొదటి ప్రపంచ కప్పు నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ కపిల్‌గా కనిపించనున్నారు. దీపికా పడుకొణె కథానాయిక. 83 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2020 ఏప్రిల్‌ 10న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. మొదటి ప్రపంచ కప్పు సందర్భాన్ని గుర్తుచేసుకోవటానికి వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నేటి తరం సినీ, క్రికెట్‌ అభిమానులు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.