ఈ ఇద్దరిని కలిపిన ‘డి-డే’

ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌ ఇద్దరూ భారతీయ చలన చిత్ర రంగం గర్వించదగ్గ నటులు. క్యాన్సర్‌ కారణంగా ఒక్క రోజు వ్యవధిలో తుది శ్వాస విడిచారు. ఈ లెజండరీ నటుల మరణ వార్త విని యావత్తు సినీ ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. విలక్షణ నటుడిగా ఇర్ఫాన్‌, రొమాంటిక్‌ హీరోగా రిషి కపూర్‌ చెరగని ముద్ర వేసుకున్నారు. వీళ్ల అకాల మరణం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈ ఇద్దరిని ఒకే చిత్రంలో చూడాలనుకున్న సినీ అభిమానుల కోరిక ‘డి-డే’ చిత్రంతో నెరవేరింది. రిషి కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, అర్జున్‌ రామ్‌పాల్‌, శ్రుతిహాసన్‌, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమే ‘డి-డే’. నిఖిల్‌ అద్వానీ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెర మీదకు వచ్చిన ఈ చిత్రంలోని ఇర్ఫాన్‌, కపూర్‌ నటన అద్భుతం. ఈ సినిమాలోని ఓ సన్నివేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇర్ఫాన్‌, కపూర్‌లని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.