జులై మొదటి వారంలో ’సడక్‌ 2’ ప్రారంభం

 
బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌భట్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సడక్‌ 2’. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కొంత మేర పూర్తి చేసుకుంది. అలియా భట్‌ కథానాయికగా, ఆదిత్యరాయ్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ వల్ల షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. అయితే తిరిగి ఇప్పుడు సినిమా షూటింగ్‌ జులై మొదటి వారంలో ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. మహారాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సినిమా పరిశ్రమ మళ్లీ తన పనిని ప్రారంభించింది. ఇంకా చిత్రంలో సంజయ్‌ దత్‌ రవివర్మగా నటిస్తుండగా, పూజాభట్‌ పూజాగా నటిస్తోంది. విశేష్‌ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో గుల్షన్‌ గ్రోవర్‌ మకరంద్‌ దేశ్‌పాండేలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 1991లో రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సడక్’ ‌సినిమాలో సంజయ్‌దత్‌, పూజాభట్‌లు నాయకానాయికలుగా నటించారు. ఇప్పుడే అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘సడక్‌ 2’ చిత్రాన్ని ఆనాటి దర్శకుడు మహేష్‌భట్‌ దర్శకత్వంలో రూపొందడం గమనార్హాం. అన్ని సక్రమంగా జరిగివుంటే ఈ పాటికే థియేటర్లో చిత్రం విడదల అయ్యేది. 





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.