సెట్స్‌లో అడుగుపెట్టిన ఖాన్‌

తెలుగు సినీప్రియులంతా సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. బాలీవుడ్‌ ప్రియులంతా ఈద్‌ వైపు దృష్టి సారించారు. ఈసారి రాబోయే రంజాన్‌కు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందు ఇద్దరు అగ్ర హీరోలు తలపడబోతున్నారు. ఈ పర్వదినానికి అక్షయ్‌కుమార్‌ తన ‘లక్ష్మీబాంబ్‌’ను థియేటర్లలోకి పట్టుకురాబోతుండగా.. సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’గా సందడి చేయబోతున్నాడు. ‘దబాంగ్‌ 3’ తర్వాత సల్లూ భాయ్‌తో ప్రభుదేవా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రమిది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఒకదాన్ని సల్మాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. దీనికి ‘‘రాధే సెట్స్‌లో తొలిరోజు.. ఈద్‌ 2020’’ అంటూ ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. ఈ వీడియోలో సల్మాన్‌ లుక్‌ను చూపించలేదు. తను స్టైలిష్‌గా నడుచుకుంటూ సెట్స్‌లో అడుగుపెట్టిన సీన్‌ను మాత్రమే చూపించారు. ఇక సల్మాన్‌ - ప్రభుదేవాల కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’.. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.