సల్మాన్‌ఖాన్‌ టైగర్‌ 3 ఏడు దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుందా?

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సీక్వెల్‌ చిత్రంగా వస్తోన్న ‘టైగర్‌ 3’లో నటించనున్నారు. ఇప్పటికే తెరపైకి వచ్చిన ‘టైగర్’‌, ‘టైగర్ జిందా హై’ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే. ‘టైగర్‌ 3’ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చిత్ర దర్శకుడు మనీష్‌ శర్మ నిర్మాత ఆదిత్య చోప్రాలు కలిసి చిత్రీకరణ కోసం లోకేషన్లు చూసేందుకు సిద్ధమౌతున్నారట. ఈ సినిమా షూటింగ్‌ ఏడు దేశాల్లో జరుపుకోనుందట. చిత్ర లోకేషన్లను చూసేందుకు డిసెంబర్‌లో యుఏఇ, ఇస్తాంబుల్‌, యుఎస్‌కు వెళ్లనున్నారట. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించేది ఎవరనేది కూడా ఇంకా తెలియదు. ఎవరైనా కొత్త నటుడిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు చిత్ర నిర్మాణ సంస్థ ఈ సెప్టెంబర్‌ 27న యష్‌ రాజ్‌ సంస్థ తన యాభై వేడుకలను చేసుకోనుంది. అప్పుడు సినిమా గురించి మరన్ని వివరాలు తెలియనున్నాయి. చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే: ది మోస్ట్ వాంటెడ్‌ భాయ్’‌ చిత్రం షూటింగ్ త్వరలోనే‌ ప్రారంభం కానుంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.