సందీప్‌ రణ్‌బీర్‌కు కథ చెప్పాడట!!

‘కబీర్‌ సింగ్‌’ హిట్‌తో బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. హిందీలో తన తొలి చిత్రంతోనే దాదాపు రూ.300 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు సందీప్‌. ప్రస్తుతం ఈ చిత్రంతో బాలీవుడ్‌లో తనకు ఏర్పడిన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్‌. దీనికి తగ్గట్లుగానే తన రెండవ చిత్రాన్ని హిందీలోనే ప్లాన్‌ చేసుకుంటున్నారు సందీప్‌. తాజాగా ఈ యువ దర్శకుడు బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను కలిశారంటూ ఓ వార్త ఉత్తరాది మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన తన తర్వాతి సినిమా కోసమే రణ్‌బీర్‌ను కలిశారని, అతనికి స్టోరీలైన్‌ కూడా వినిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రణ్‌బీర్‌కు కూడా కథ నచ్చడంతో ఫుల్ స్ర్కిప్ట్‌ రెడీ చేసి తీసుకురమ్మని సందీప్‌ వంగాకు సూచించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే వచ్చే ఏడాది చివరి వరకైనా వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర’ వంటి భారీ ప్రాజెక్టుతో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అవి పూర్తయితేనే సందీప్‌తో చేయడానికి రణ్‌బీర్‌కు వీలు కుదురుతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.