దర్శకత్వం.. నిర్మాణం.. చూపంతా బాలీవుడ్‌పైనే!!

టీవల కాలంలో తెలుగు చిత్రసీమ నుంచి బాలీవుడ్‌లోకి వెళ్లి, తొలి ప్రయత్నంలోనే అక్కడ సత్తా చాటిన అతికొద్ది మంది దర్శకుల్లో సందీప్‌ రెడ్డి వంగా ఒకరు. తెలుగు ట్రెండ్‌ సెట్టర్‌ హిట్‌గా నిలిచిన తన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్నే హిందీలో్ ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి భారీ విజయాన్నిఖాతాలో వేసుకున్నారు. తొలి సినిమాతోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడిగా అరుదైన ఖ్యాతి దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్‌ నుంచి రాబోయే తర్వాతి చిత్రంపై అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే నిన్నమొన్నటి వరకు సందీప్‌ తర్వాతి ప్రాజెక్టు తెలుగులోనే ఉండబోతుందని వార్తలొచ్చినప్పటికీ ప్రస్తుతం అది వాస్తవం కాదని తేలిపోయింది. ఎందుకంటే ఈ యువ దర్శకుడు మరో రెండేళ్ల పాటు బాలీవుడ్‌లోనే మకాం వేయాలని ఫిక్స్‌ అయిపోయాడట. అంతేకాదు తన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకోని తర్వాతి చేయబోయే సినిమాను అటు హిందీతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కించేలా ప్రణాళికలు రచిస్తున్నాడట. ఈలోగా సందీప్‌ బాలీవుడ్‌లో ఓ చిన్నబడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించాలని చూస్తున్నాడట. అలాగని ఇందులో ఆయనేం పెట్టుబడి పెట్టడట. కేవలం తన బ్రాండ్‌ ఇమేజ్‌నే పెట్టుబడిగా పెట్టి సినిమాను బాలీవుడ్‌ వాసులకు చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట. మొత్తానికి సందీప్‌ ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో పూర్తిగా బాలీవుడ్‌లోనే పాతుకుపోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.