ఆదిత్యరాయ్‌ కపూర్‌ సరసన సుశాంత్‌ సింగ్ భామ సంజన

ఆదిత్యరాయ్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓమ్‌: ది బాటిల్‌ విత్‌న్‌. కపిల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ సరసన నటించిన సంజన సంఘి కథానాయికగా నటిస్తోంది. ఎ పేపర్ డాల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్, అహ్మద్ ఖాన్ మరియు షైరా ఖాన్ నిర్మిస్తున్నారు. ఆదిత్యరాయ్‌తో కలిసి తొలిసారిగా నటిస్తోంది సంజన. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ.. తన తొలి చిత్రంలోనే సంజన ఓ గొప్ప పరిపక్వత కలిగిన పాత్రను పోషించింది. అలాంటి సంజన మా చిత్రంలోని పాత్రకు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ చిత్రాన్ని ఇండియాలోని మూడు నగరాల్లో చిత్రీకరణతో పాటు విదేశాల్లోనూ షూటింగ్‌ జరుపుకోనుంది. చిత్ర షూటింగ్‌ వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఇక సినిమా గురించి సంజన సంఘి మాట్లాడుతూ..ఇలాంటి పెద్ద యాక్షన్‌ ఎంటటైనర్‌ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నిర్మాతలు అహ్మద్‌ఖాన్‌, జీ స్టూడియోస్‌ దర్శకుడు కపిల్‌కి నా ధన్యవాదాలు. చిత్రంలో నా పాత్ర పేరు కావ్య. ఇది ఇండియాలోని ప్రతి యువతికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పగలను. ఆ పాత్ర గురించి నేను చాలా తెలుసుకోబోతున్నాను. కావ్య కోసం ఎన్నో రకాల శిక్షణతో పాటు మానసికంగా, శారీరకంగా నన్ను ఈ పాత్ర పరిక్షిస్తోంది. అయినా ఇది చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఆదిత్యతో కలిసి పనిచేయడం చాలా కొత్తగా, గొప్పగాను ఉంది. సినిమా కోసం అతను కూడా చాలా కష్టపడుతున్నాడని చెబుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.