అవినీతిపై యుద్ధం చేస్తున్న జాన్‌ అబ్రహంజాన్‌ అబ్రహం రొమాంటిక్‌ - యాక్షన్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించారు.  ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందింది, భరతజాతిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మిలాప్‌ జవేరి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే 2’. గతంలో వచ్చిన ‘సత్యమేవ జయతే’కి ఇది సీక్వెల్‌ చిత్రం. చిత్రంలో జాన్‌ అబ్రహం హీరోగా దివ్య ఖోస్లా కుమార్‌ కథానాయికగా నటిస్తున్నారు. చిత్రాన్ని వచ్నే ఏడాది మే 12న ఈద్‌ పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చిత్రం కథేంటంటే పోలీసులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సామాన్యుల అవినీతి నేపథ్యం చుట్టూ తిరగనుంది. అన్యాయం, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం నేపథ్యంగా సినిమా ఉండనుంది. చిత్ర షూటింగ్‌ ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో  ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడయ మిలాప్ జావేరి మాట్లాడుతూ.. ‘‘సినిమా చిత్రీకరణ లోకేషన్‌తో పాటు కథను కూడా ముంబై నుంచి లక్నో మర్చాం. చిత్రాన్ని సృజనాత్మకంగా మార్పులు చేసి లక్నోగా మార్చాం. ఎందుకంటే కథ మరింత పెద్దిగా ఉంటుంది. దృశ్యపరంగా కూడా లక్నో వైభవాన్ని పెంచుతుంది. చిత్రంలో కథ చాలా వీరోచితంగా - శక్తివంతంగాను ఉంటుంది. జాన్ వెండితెరపై ఇంతకు ముందెన్నడూ చేయని కొత్త పాత్రలో కనిపించనున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ‘సత్యమేవ జయతే’ మాస్ చిత్రం. ఈ సీక్వెల్‌ చిత్రం యాక్షన్‌తో పాటు సంగీతం, డైలాగ్స్, దేశభక్తి, వీరత్వం అన్ని కలిసి ఉంటాయి. ఇలాంటి చిత్రాన్ని వచ్చే ఏడాది ‘ఈద్‌’ పండక్కి విడుదల చేయడానికి సరైన సందర్భంగా భావించాం. ఇక నిర్మాతలు భూషణ్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ నాకు చాలా మద్దతు ఇచ్చారు. ఇక చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..మిలాప్‌ జవేరి భారతదేశపు హృదయాన్ని గ్రహించారు. భారత్‌లో నాకు ఇష్టమైన పట్టణాల్లో లక్నోలో చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఇది మాకు చాలా ప్రత్యేకం. మొదటి చిత్రం కన్నా ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తారు. జాన్‌ అబ్రహంని సరికొత్తగా చూడనున్నాం. మిలాప్‌ మనసు కదిలించే అద్భుతమైన స్ర్కిప్టుని రాశారు. వచ్చే ఏడాది థియేటర్లలోనే పండుగ చేసుకోవచ్చుని భూషణ్, నిఖిల్‌ అడ్వాణి చెప్పారు. చిత్రంలో మనోజ్‌ బాజ్‌పేయి, నోరా ఫతేహి, దయా శంకర్ పాండేలు నటిస్తున్నారు. 

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.