రీమేక్‌ చిత్రంలో షారుఖ్‌ - కత్రీనా!

ఇప్పుడంతా బాలీవుడ్‌లో రీమేక్‌ చిత్రాల హువా నడుస్తున్నట్లుంది. అమితాబ్‌ బచ్చన్, హేమామాలిని కలిసి నటించిన చిత్రం ‘సత్తే పె సత్తా’. ప్రస్తుతం ఈ సినిమాని దర్శకులు రోహిత్‌ శెట్టి, ఫర్హాఖాన్‌లు రీమేక్‌ చేయనున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా షారుక్‌ఖాన్, కత్రీనా కైఫ్‌లను నటించనున్నారు. కత్రీనా, షారుఖ్‌తో కలిసి ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో కలిసి పనిచేసింది. యాక్షన్, కామెడీతో కూడిన ‘సత్తే పె సత్తా’ చిత్రం 1982లో విడుదలై మంచి పేరే సంపాదించి పెట్టింది. అసలు ఈ చిత్రం కూడా సొంతంగా తయారు చేసుకొన్న కథ కాదు. హాలీవుడ్‌కు చెందిన ‘సెవెన్‌ బ్రైడ్స్‌ సెవెన్‌ బ్రదర్స్‌’ అనే చిత్రాన్ని అనుసరించి తీశారు. ఇప్పటికే నటుడు గోవింద - కరిష్మాకపూర్‌ నటించిన ‘కూలీ.నెం.1’ చిత్రాన్ని రీమేక్‌గా అదే పేరుతో ప్రస్తుతం వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.