అలరిస్తున్న విద్యాబాలన్‌ శకుంతల దేవి ట్రైలర్‌


‘డర్టీపిక్చర్‌’, ‘కహానీ’ వంటి నాయికా ప్రాధాన్య చిత్రాలతో సినీప్రియులను ఆకట్టుకున్న నటి విద్యాబాలన్‌. బాలీవుడ్‌లో ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంలో ఇస్రో శాస్త్రవేత్తగా సందడి చేసింది. ప్రస్తుతం గణితవేత్తగా కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విద్యాబాలన్‌. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరు పొందిన ప్రముఖ గణితవేత్త శకుంతల దేవి జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రం ‘శకుంతల దేవి’. అను మేనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో శకుంతల దేవిగా విద్య లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంది. ఆమె లండన్‌కి వెళ్లనప్పటి నుంచి, ఆమె ప్రయాణించిన అనేక పరిసరాలతో పాటు, విజయాలు, కుటుంబంలోని కష్టనష్టాలు వాటిని బాధ్యతగా నిర్వర్తించడానికి చాలా కష్టపడుతోంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ప్రొడక్షన్స్, అబుందంతియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్యాబాలన్‌ కూతరుగా సన్యా మల్హోత్రా పోషిస్తోంది. ఇంకా చిత్రంలో అమిత్ సాధ్, జిషు సేన్‌గుప్తా తదితరులు నటిస్తున్నారు. చిత్రం జులై 31న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.