ఆకట్టుకుంటోన్న ‘భారత్‌’ పెళ్లిపాట
                              

సల్మాన్‌ ఖాన్‌ తెరపై ఎంతో మంది కథానాయికలతో రొమాన్స్‌ చేసి ఉండొచ్చు. కానీ కత్రినా కైఫ్‌తో పండించే కెమిస్ట్రీ మాత్రం అద్భుతం అనేలా ఉంటుంది. తాజాగా వారిద్దరూ కలసి నటిస్తున్న ‘భారత్‌’లోంచి విడుదలైన ‘అతియే ఆ..’ అనే పాట చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1983లో ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాటలో సల్మాన్, కత్రినా ఒకరినొకరు కవ్వించుకుంటూ సరసాలాడటం చూడముచ్చటగా ఉంది. ముఖ్యంగా కత్రినా చీరెలో అందాలు ఆరబోస్తూ అదిరిపోయే డ్యాన్సులతో వేడెక్కించేసింది. సల్మాన్‌ సన్నటి మీసకట్టు, కళ్లజోడుతో సరికొత్తగా కనిపిస్తూ తనదైన జోష్‌తో ప్రత్యేకాకర్షణ తీసుకొచ్చారు. అందుకే ఆన్‌లైన్‌లో ఈ పాట తెగ సందడి చేస్తోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించిన ‘భారత్‌’లో దిశా పటానీ, టబు కీలక పాత్రల్లో నటించారు. జూన్‌ 5న ఈ చిత్రం విడుదలవుతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.