‘సూర్యవంశీ’తో.. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వస్తున్నాం

మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్‌ జంటగా సందడి చేయబోతున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సూర్య వంశీ’. కరణ్‌జోహార్‌ నిర్మాత. తాజాగా ఈ చిత్రంలో నాయికగా కత్రినాకైఫ్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ‘‘సూర్యవంశీ’ బృందంలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. రోహిత్‌ శెట్టితోనూ, కరణ్‌జోహార్‌తోనూ తొలిసారి పనిచేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పోస్ట్‌ చేసింది కత్రిన. ‘‘మా పోలీస్‌ బృందంలోకి కత్రినాకు స్వాగతం’’ అంటూ ట్వీటారు అక్షయ్‌. పోలీస్‌ కథ నేపథ్యంలో ‘సింగం’, ‘సింబా’ తర్వాత రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘హమ్‌ కో దీవానా కర్‌ గయే’, ‘వెల్‌కమ్‌’, ‘నమస్తే లండన్‌’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ చిత్రాలు అక్షయ్‌- కత్రినా కలయికలో వచ్చి విజయవంతమయ్యాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.