షారుఖ్‌ సరసన తాప్సి?

దక్షిణాదిలో గ్లామర్‌ పాత్రలతో అలరించిన తాప్సి కొత్త దారిలో వెళుతూ విజయాలు అందుకుంటుంది. ‘పింక్‌’, ‘బద్లా’, ‘శాండ్‌ కీ ఆంఖ్‌’, ‘తప్పడ్‌’ లాంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆమెకు ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు షారుఖ్‌ఖాన్‌ సరసన నటించే అవకాశం దక్కినట్టు సమాచారం. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్‌ ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఇందులో నాయికగా తాప్సిని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తాప్సి నటించిన ‘బద్లా’ను షారుఖ్‌ఖాన్‌ చిత్ర నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. అన్ని అనుకున్నట్టు జరిగితే షారుఖ్‌తో కలిసి తాప్సి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.