మొఘల్‌ సామ్రాజ్యంలోని యుద్ద ఘట్టాలు

మొఘల్‌ సామ్రాజ్యం ఎలా ఉండేది? అప్పుడు జరిగిన యుద్దాలేంటి? వీటినే వెండితెరపై చూపిస్తున్నారు ‘తన్హాజీ : ది అన్సంగ్‌ వారియర్‌’ దర్శకనిర్మాతలు. 17వ శతాబ్దంలోని కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ఇది. భారీ సెటింగ్‌లు, హాలీవుడ్‌ స్థాయి సాంకేతికత, యుద్ధంలో గెలవటానికి రాజులు వేసే ఎత్తులు-పైఎత్తులు, సైఫ్‌ అలీ ఖాన్‌ క్రూరత్వం, యుద్ధ నేపథ్య సన్నివేశాలు ప్రచార చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘తన్హాజీ’ని 2020 సంక్రాతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.