ఫైలట్‌గా కంగనా రనౌత్‌!

కంగనా రనౌత్‌ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది బాలీవుడ్‌ రెబల్‌ మహిళా స్టార్‌గా. ఇప్పటికే ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝూన్సీ’ చిత్రంలో రాణీ లక్ష్మీభాయిగా నటించి అలరించింది. ప్రస్తుతం రోనీ స్కూవాలా నిర్మాతగా ‘తేజస్’‌ అనే చిత్రం చేస్తుంది. సర్వేష్ మేవారా దర్శకత్వంలో కంగనా రనౌత్‌ భారతీయ వైమానికదళ ఫైలట్‌గా నటిస్తోంది. సినిమాని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తమ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. చిత్ర కథంతా 2016లో భారతీయ వైమానిక దళంలో మహిళ ఫైలట్ల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కంగానాతో కూడిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ..‘‘భారతీయ వైమానిక దళ ఫైలట్‌గా పాత్రలో నటించే అధికారం నాకుంది. ప్రతిరోజూ తమ విధి నిర్వహణలో అపారమైన త్యాగాలు చేసే, ధైర్యవంతులపై తెరకెక్కించే ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉందని’’ చెప్పారు. నిర్మాత రోనీ స్కూవాలా స్పందిస్తూ..‘‘ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ని ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని ప్రకటించేందుకు సంతోషంగా ఉంది. ‘ఉరి: సర్జికల్ స్ట్రైక్’ భారత సైన్యం గురించి గొప్పగా చెప్పుకుంది. అలా ‘తేజస్’‌ చిత్రంలో భారత వైమానిక దళ ఫైలట్లకు మా సినిమా అంకితం. ఈ సినిమా అంతా ఒక మహిళా ఫైలట్‌ చుట్టూ తిరుగుతోంది. ఇక కంగానా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా భారత వైమానిక దళంలో పనిచేయడానికి మహిళలకు స్ఫూర్తి నింపుతోందని’’ నమ్ముతున్నాం. మరోవైపు దర్శకుడు సర్వేష్‌ మేవారా స్పందిస్తూ..‘‘ఈ చిత్రం ప్రస్తుతం భారతదేశ భావనకు ప్రతిబింబంగా ఉంటుంది. మా కథతో దేశభక్తి, జాతీయవాదం స్ఫూర్తిని పెంచేలా ఉంటుందని ఆశిస్తున్నా. అంతేకాదు కంగనా పాత్ర ఈ దేశంలోని యువతకు ప్రతిధ్వనించే స్వరం అవుతుందని అనుకుంటున్నా. కంగనా కలిసి పనిచేయడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉండలేకపోతున్నా’’ అని తెలిపారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.