‘వర్జిన్‌ భానుప్రియ’ వచ్చేది అప్పుడే!

‘కాబిల్‌’ ‘పాగల్‌పంతి’లాంటి చిత్రాల్లో మెరిసిన తార ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం అజయ్‌ లోహన్‌ దర్శకత్వంలో హాస్యనేపథ్యంలో వస్తున్న చిత్రం ‘వర్జిన్‌ భానుప్రియ’. ఊర్వశి ఇందులో మామూలు పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో రౌతేలా సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి (భానుప్రియ)గా నటిస్తోంది. అయితే తను చదువుకునే కళాశాల్లోనే కొంతమంది స్నేహితులు ఏర్పడతారు. అక్కడ ఈ సంప్రదాయంగా పెరిగిన అమ్మాయి అనుకోకుండా సంప్రదాయనికి విరుద్దమైన పోకడలుపోవాలని అనుకుంటుంది. కానీ అది ఆమెకు సాధ్యపడదు. తరువాత ఆమె ఏం చేసింది అన్నదే ఇందులో కథ. ఈ చిత్రం గురించి ఊర్వశి మాట్లాడుతూ..‘‘నేను ఈ చిత్రంలో పరితపించే స్నేహాన్ని కోరుకునే అమ్మాయిగా నటిస్తున్నాను. కానీ ఆమె చేసిన ఏ ప్రయత్నాలు సఫలం కాలేక విఫలమవుతుంది. చిత్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఓ ముఖ్యమైన కథను వినోదాత్మకంగా చెప్పేదానికి నేను ఎంతో ఇష్టపడ్డానని’’ చెప్పింది. లిలిత్‌ కిరి సమర్పణలో ధారివాల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రం జూన్‌ 12, 2020న విడుదల కానుంది.


                               Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.