యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్లో విక్కీ కౌశల్‌ చిత్రం

‘లవ్‌ ఫెర్ స్వ్కయర్‌ ఫూట్’‌, ‘సంజు’, ‘మన్మార్జియాన్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు విక్కీ కౌశల్‌. తాజాగా ఈ నటుడు యష్‌ రాజ్‌ ఫిల్మ్స పతాకంపై ఓ సినిమాలో చేయనున్నాడు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌ ఇప్పటి వరకు చేయని కొత్త పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందట. అక్టోబర్‌ నాటికి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకొని నవంబర్‌ నాటికి షూటింగ్‌కి సిద్ధం అయ్యేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యష్ రాజ్‌ ఫిల్మ్స సంస్థ స్థాపించి 50 యేళ్లు అవుతోంది. విక్కీ కౌశల్‌ తొలిసారిగా యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ సంస్థలో తొలిసారిగా నటిస్తున్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్, సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో ‘సర్దార్‌ ఉద్ధమ్‌ సింగ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. రైజింగ్‌ సన్‌ ఫిల్మ్స్, కినో వర్క్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమాకి అజయ్‌-అతుల్‌ స్వరాలు అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.