పవర్‌స్టార్‌ చిత్రంలో.. విక్కీ కౌశల్‌ హీరోగా!

‘ఉరీ’ సినిమా హిట్​తో బాలీవుడ్​లో ఓవర్‌నైట్‌ స్టార్​గా ఎదిగిపోయాడు విక్కీ కౌశల్​. ఈ చిత్రంలో జవాన్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించిన విక్కీ.. ఇప్పుడు పవరస్టార్‌లా ‘కాటమరాయుడి’ అవతారంలోకి మారబోతున్నాడు. తమిళ హిట్‌ మూవీ ‘వీరం’కు రీమేక్‌గా ‘కాటమరాయుడు’ను రూపొందించిన సంగతి తెలిసిందే. పవన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం.. 2017లో విడుదలై మిశ్రమ ఫలితాన్ని అందుకొంది. ఇప్పుడు దీన్నే విక్కీ కౌశల్‌ హీరోగా బాలీవుడ్‌లో పునర్నిర్మించబోతున్నారు. దీనికి 'ల్యాండ్​ ఆఫ్​ లుంగీ' అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సాజిద్ నదియద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫర్హత్​ సమ్జీ దర్శకత్వం వహించనున్నారు. తొలుత ఈ ప్రాజెక్టు కోసం అక్షయ్‌ కుమార్‌ను సంప్రదించిందట చిత్ర బృందం. కానీ, డేట్లు ఖాళీ లేని కారణంగా అక్షయ్ దీన్ని వదులుకున్నాడట. ప్రస్తుతం ఆయన ‘లక్ష్మీబాంబ్’, ‘సూర్యవంశీ’, ‘ద ఎండ్​’, ‘గుడ్‌న్యూస్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.