విక్కీతో సారా?

ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ‘యురి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’తో భారీ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌. ఇప్పుడు ఈ కలయికలో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి ‘అశ్వద్థామ’ అనే పేరు అనుకుంటున్నారు. సూపర్‌ హీరో కథతో యాక్షన్‌కు పెద్దపీట వేస్తూ తెరకెక్కించనున్నారట. తాజాగా ఈ చిత్రంలో నాయికగా సారా అలీఖాన్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమెకు ఈ కథ, అందులోని తన పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్టు బాలీవుడ్‌ సమాచారం. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో పలు హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టారట.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.