షెర్ని షూటింగ్‌లో పాల్గొన్న విద్యాబాలన్‌!

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న నూతన చిత్రం షెర్ని. లాక్‌డౌన్‌ ముందే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ మార్చి మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. అమిత్‌ మసూర్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మధ్యప్రదేశ్‌లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విద్యాబాలన్‌ సినిమా షూటింగ్‌ సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరలౌతున్నాయి. సినిమాలో విద్యాబాలన్‌ అటవి అధికారిగా కనిపించనుంది. అబున్‌దంతియా ప్రొడక్షన్స్ సమర్పణలో టీ-సీరీస్‌ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భూషణ్‌ కుమార్‌, విక్రమ్‌ మల్హోత్రా, కిషన్‌ కుమార్‌ నిర్మాతలు. చిత్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ..నేను న్యూటన్‌ ప్రేమిస్తున్నా. దర్శకుడు అమిత్‌ నాకు కథ షెర్ని చిత్రం గురించి చెప్పినప్పుడు నాకు సినిమా చేయాలని నిశ్చయించుకున్నా. నేనే ప్రధాన పాత్రలో ఉండాలి ఎప్పుడూ అనుకోలేదు. కానీ కథలో దమ్ముంటే కచ్చితంగా ఆస్వాదిస్తాను. నాకు నచ్చితేనే సినిమాలు చేస్తానని తెలిపింది. ఈ ఏడాదిలో విద్యాబాలన్‌ హ్యుమన్‌ కంప్యూటర్‌ శకుంతలాదేవి జీవితాధారంతా తెరకెక్కిన శకుంతలాదేవి చిత్రంలో నటించింది. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై ఆకట్టుకుంది. విద్యా గత ఏడాది తెలుగులో ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రంలో బసవతారకం పాత్రలో నటించి అలరించింది. హిందీలో మిషన్‌ మంగళ్‌ చిత్రంలో ప్రాజెక్టు డైరక్టర్‌ తారా షిండే పాత్రలో కనిపించి మెప్పించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.