ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటీనటులుగా కత్రీనా కైఫ్, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్నారు. కోవిడ్ కారణంగా దర్శకుడు వరుణ్ ధావన్ నటించాల్సిన ఎక్కిస్ అనే చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై దర్శకుడు శ్రీరామ్ రాఘవ్ దృష్టి మరల్చాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలో కాతువాకుల రెండు కాదల్ చేస్తున్నారు. ఈ మధ్యే తమిళంలో వచ్చిన మానగరం చిత్రాన్ని హిందీలో సంతోష్ శివన్ రీమేక్ చేస్తున్నారు.ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఇక అంధాదున్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో కత్రీనా కైఫ్ - విజయ్ సేతుపతి కలిసి నటించడం ఇదే మొదటిసారి. మరి వీరి జంట ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి. కత్రీనా కైఫ్‌కి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ఫోన్ బూత్ చిత్రంలో నటిస్తోంది. ఇక అలీ అబ్బాస్ జాఫర్‌తో కలిసి సూపర్‌హీరో చిత్రానికి పనుల్లోనూ బిజీగా ఉంది. ఆమె ఇప్పటికే నటించిన సూర్యవన్షి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.