'ఎ సూటబల్‌ బాయ్' సెట్లో వరంగల్‌ శివ

నాని నటించిన ‘ఎంసీఏ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) చిత్రంలో ప్రతినాయకుడి (వరంగల్‌ శివగా నటించి మెప్పించాడు విజయ్‌ వర్మ. ప్రస్తుతం ఈ నటుడు ‘మీర్జాపూర్‌ 2’ చిత్రంలో అలరిస్తున్నారు. టబు, ఇషాన్‌ ఖట్టర్‌లతో కలిసి ‘ఏ సూటబుల్‌ బాయ్‌’లో సినిమాలో రషీద్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తోటి తారలతో కలిసి సెట్లోని కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘ఇక్కడ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. సినీ దిగ్గజాలు ఉన్నారు. వారిలో శాశ్వతమైన దేవత టుబు, రాక్‌స్టార్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అర్జున్‌ బాసిన్‌, ఇలాంటి బృందంతో మరోసారి కలిసి మళ్లీ చేయగలమా ఇషాన్‌? అంటూ..’’ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. విక్రమ్‌ సేథ్‌ నవల ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. మీరా నాయర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇషాన్‌ ఖట్టర్‌ రాజకీయ నాయకుడి కుమారుడిగా నటిస్తున్నారు. టబు సైదా బాయి అనే వేశ్య పాత్రలో నటిస్తుంది. చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం లక్నో నగరంలోని రాజభవనాల్లో, మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరించారు. తాన్య మణిక్తాలా, రసిక దుగ్గల్, షహానా గోస్వామి, నమిత దాస్, వివేక్‌ గోంబర్‌ తదితర నటీనటులు నటిస్తున్నారు. త్వరలోనే చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుంది. ఇక విజయ్‌ వర్మ 'మీర్జాపూర్ 2'లో శత్రుఘన్, భరత్ త్యాగిగా నటించి మెప్పిస్తున్నారు. చిత్రం అక్టోబర్‌ 23, 2020న విడుదలైంది.

View this post on Instagram

A post shared by Vijay Varma (@itsvijayvarma) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.