బాలీవుడ్‌కి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా క్రాంతి మాధవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, ఇజాబెల్లే, కేథరిస్‌ నాయికలు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా తెలుగునాట విడుదలైన ఈ సినిమా అశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనం బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌కు బాగా నచ్చడంతో ఈ చిత్రం రీమేక్‌ హక్కులు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని టాక్‌. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మరి విజయ్‌ పాత్రలో ఏ బాలీవుడ్‌ హీరో కనిపిస్తాడో చూడాలి. ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న ‘ఫైటర్‌’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహిస్తున్నారు కరణ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.