ప్లే స్కూల్‌ టీచర్‌గా యామీ గౌతమ్‌

‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైయిక్’‌ చిత్రంలో యామి గౌతమ్‌ ఇంటలిజెన్స్ బ్యూరో రహాస్య గూఢచారిగా పల్లవి శర్మ పాత్రల్లో మెప్పించింది. ప్రస్తుతం ఆర్‌ఎస్‌విపి, మంకీ ఫిల్మ్స సంయుక్తంగా నిర్మిస్తోన్న థ్రిల్లర్‌ చిత్రం ‘ఏ థర్స్ డే’ చిత్రంలో నటిస్తోంది. బెహ్జాద్ ఖంభక్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో యామి ప్లే స్కూల్ టీచర్‌గా కనిపించనుంది. 16మంది పసిబిడ్డలను బందీగా తీసుకొని ఏం చేసిందనేది కథ. ఈ చిత్రం గురించి యామి సందిస్తూ.. ‘ఏ థర్స్ డే’ చిత్రం అరుదైన స్ర్కిప్టులో ఒకటి. ఏ ఇతర మహిళా కథానాయికకు రాయని బలమైన పాత్రలలో ఒకటి బెహ్జాద్ ఈ పాత్రకు రాశారు. నేను చేయబోయో పాత్ర భయంకరమైనది, మనోహరమైనదని..’’ వెల్లడించింది. చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన రోనీ స్ర్కూవాలా మాట్లాడుతూ..‘‘యామి ఒక అద్భుతమైన నటి. చిత్రంలో ఆమెలోని కొత్త అవతారాన్ని ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తారు. బెహ్జాద్‌ మంచి స్ర్కిప్టును అందించారు. అందుకు నేను అభినందించకుండా ఉండలేకోపోతున్నాని’’ అన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఓటీటీలో విడుదల చేయనున్నారు. యామి ఇంకా ‘గిన్నీ వెడ్స్ సన్నీ’ చిత్రంతో పాటు ‘బూత్‌ పోలీస్‌’లో సైఫ్‌ అలీ ఖాన్‌, అర్జున్‌ కపూర్‌లు కలిసి నటిస్తోంది. ఇందులో జాక్విలిన్‌ మరో కథానాయిక. క్రేజీ హర్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రానికి పవన్‌ కిర్పాలానీ దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతమ్‌ గత ఏడాది ఆయుష్మాన్‌ ఖుర్రానాతో కలిసి ‘బాలా’ చిత్రంలో పారి మిశ్రా పాత్రలో కనిపించి అలరించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.