సారా - కార్తిక్‌ ఆర్యన్‌ల మధ్య చిలిపి గొడవ!

బాలీవుడ్‌ నటులైన సారా అలీఖాన్, కార్తిక్‌ ఆర్యన్‌లు కలిసి నటించిన చిత్రం ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’. ప్రేమికుల దినోత్సం సందర్భంగా చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 14) విడుదలైంది. తాజాగా కార్తిక్‌ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఆ వీడియోలో కార్తిక్‌ ఆర్యన్‌ ఇద్దరు కుర్రాళ్లతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ ఉంటాడు. తన వెనుకాల సారా కూడా వస్తుంది. ఇది చూసిన కుర్రాళ్లో ఒకడు..‘‘అన్నయ్యా...వదినమ్మ వచ్చింది చూడు’’ అంటూ చెప్తాడు. దాంతో కార్తిక్‌ బిత్తరపోతాడు. పక్కన్నే ఇది విన్న సారా అలీఖాన్‌ నవ్వుతూ..‘‘వదినమ్మా’’ అంటూ అని ఎవరు పిలిచారు? అని బాలుడిని ప్రశ్నిస్తూ అతనివైపు వెళ్తుంది. ఇదిగో ఇతనే కదా నిన్ను అలా పిలమని చెప్పింది అంటూ కార్తిక్‌తో దెబ్బలాడుతుంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. గత కొంతకాలంగా వీరి మధ్య ఏదో నడుస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి.

View this post on Instagram

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.