‘83’ ప్రపంచకప్‌ కోసం రణ్‌వీర్‌ కష్టం

భారత మాజీ స్టార్‌ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రం ‘83’. రణ్‌వీర్‌ సింగ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్‌ ఎలా సాధించిందనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం 2020 ఏప్రిల్‌ 10న విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నెట్స్‌లో బాల్‌తో, బ్యాట్‌తో తీవ్రంగా శ్రమిస్తున్నారు రణ్‌వీర్‌ సార్థ్యంలోని 1983 భారత్‌ టీమ్‌. దీనికోసం చిత్ర నటీనటులంతా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అక్కడ రణ్‌వీర్‌కు కపిల్‌తోపాటు పలువురు క్రికెటర్లు మెళకువలు నేర్పించారు. ఈ సినిమా కోసం చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియోను రణ్‌వీర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందరూ నటీనటులు ఎంతో శ్రమిస్తూ కనిపించారు. నటరాజ్‌ షాట్‌ను రణ్‌వీర్‌ పర్‌ఫెక్ట్‌గా చేశారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.