తెరపై ముద్దు వొద్దు

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ సినిమాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందినవి కుటుంబ కథా చిత్రాలే. ప్రస్తుతం టబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్, అజయ్‌ దేవగణ్‌లు నాయకనాయికలుగా నటించిన చిత్రం ‘ దే దే ప్యార్‌ దే’. త్వరలో ప్రేక్షకుల ముందకురాబోతోంది. తాజాగా ఆయన ఓ మీడియా ముఖాముఖిలో మాట్లాడుతూ తన సినిమాల్లో ముద్దు సీన్లు ఎందుకు ఉండవో చెప్పారు.‘‘ నేను ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలనే ఎంచుకుంటాను..నా సినిమాకు వచ్చే ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా చూడాలనుకొంటాను. వ్యక్తిగతంగా నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకే ఇష్ట పడతాను. అలా చూస్తున్నప్పుడు ముద్దు సన్నివేశాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అంతే కాకుండా మన కంటే పెద్దలు, పిల్లలు మధ్య అటువంటి సన్నివేశాలను చూడటం ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నా సినిమాల్లో అటువంటి దృశ్యాలు లేకుండా జాగ్రత్తలు’’ తీసుకొంటానన్నారు. బాలీవుడ్‌లో అజయ్‌లాగే సల్మాన్‌ వంటి హీరోలు కూడా మద్దు సీన్లలో నటించకూడదనే నియమం పెట్టుకొన్నారట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.