హోమోసెక్సువల్‌ పాత్రలు
నటుడన్న తర్వాత సినిమా కథను అనుసరించి ఎటువంటి పాత్రలైనా పోషించాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా, కొన్ని జుగుప్సాకరంగా ఉండే పాత్రలు. నపుంశకుడిగా నటించే పాత్రలు నవ్వుపుట్టిస్తాయి. కానీ స్థాయి మించితే అసహ్యించుకుంటాం. అలాగే హోమోసెక్సువల్‌ పాత్రలు జుగుప్సను కలిగిస్తాయి. హిందీ సినిమాల్లో అటువంటి పాత్రలు పోషించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ‘ఆలిఘర్‌’ అనే బయోపిక్‌ సినిమా వచ్చింది. ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు స్వలింగ సంపర్కుని లక్షణాలు కలిగి, కొందరు విద్యార్థులను పెడత్రోవ పట్టించే పనులు చేస్తుంటాడు. ఆ ఆచార్యుని యూనివర్సిటీ బర్తరఫ్‌ చేసింది. ఈ నేపథ్యంలో నడిచే కథలో ఆ పాత్రలను మనోజ్‌బాజ్‌పేయీ పోషించాడు. అలాగే ‘దోస్తానా’ సినిమాలో అభిషేక్‌బచన్‌ నపుంసకుని పాత్ర లక్షణాలు కలిగిన మగ నర్సుగా ఒక ఆసుపత్రిలో పని చేస్తూ జాన్‌ అబ్రహాంను ఆటపట్టిస్తాడు. ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్‌ఖాన్‌ ఒక ‘గే’ అవతారమెత్తుతాడు. అతనికి వచ్చే టెలిఫోన్‌ కాల్స్‌కు ఒక నపుంశకుడు మాట్లాడే రీతిలో జవాబులిస్తూ ఉంటాడు. ‘ఫైర్‌’ సినిమాలో షబానా అజ్మి ఒక అణచివేయబడిన ఇల్లాలుగా నటించింది. స్వాంతన కోసం ఆమె తన వదిన వద్ద సన్నిహితంగా ఉంటూ హోమోసెక్స్‌ కోసం పాకులాడుతుంది. అందులో నందితాదాస్‌ వదినగా నటించింది. ‘మార్గరిటా విత్‌ ఎ స్ట్రా’ సినిమాలో కల్కికోచ్లిన్‌ కాలేజి విద్యార్థినిగా లెస్బియన్‌ లక్షణాలు వున్న యువతిగా దర్శనమిస్తుంది. ఆమె మగవాడిని, ఆడదాన్ని కూడా ఇష్టపడుతున్న బై-సెక్సువల్‌ మహిళగా ఆ సినిమాలో నటించింది. కరణ్‌జోహార్‌ నిర్మించిన ‘బాంబేటాకీస్‌’ సినిమాలో సాఖిబ్‌ సలీం ‘గే’ పాత్రను పోషించాడు. అందులో ఈ కుర్రాడు రణదీప్‌ హుడాతో ముద్దు సన్నివేశంలో నటించడం విమర్శకు గురైంది. ఇలాంటి సన్నివేశాలకు విలువ ఉండదు. తప్పుడు సంకేతాలు పంపే ఇటువంటి పాత్రలను సినిమాలో నిషేదించితే మంచిదని సెన్సార్‌ బోర్డు ఆలోచిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.