మండే ఎండల్లో విడుదలైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’

‘యే సాచ్ హై కోయి కహానీ నహిన్’, ‘హమ్కో తుమ్సే హో గయా హై ప్యార్ క్యా కరే’ అంటూ సాగే ఈ పాటలు వింటుంటే ఇప్పటికీ అదో తెలియని ఓ అనుభూతి. ఒక తల్లి, ముగ్గురు అన్నదమ్ములు, మూడు మతాలు. చిన్నప్పుడే ఆ పిల్లలను వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు దత్తత తీసుకుంటారు. ఆ తరువాత వాళ్లు పెరిగిపెద్దై ఎలా కలుసుకున్నారనే అంశంపై వచ్చిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. సరిగ్గా నలభైమూడు సంవత్సరాల (మే 27, 1977) కిందట విడుదలైంది ఈ సినిమా. వినోద్‌ ఖన్నా, అమితాబచ్చన్‌, రిషి కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కథానాయికలుగా షబానా అజ్మీ, పర్వీన్‌ బాబీ, నీతూ సింగ్‌లు నటించారు. భారతీయ కుటంబ కథా నేపథ్యంలో మన్మోహన్‌ దేశాయ్‌ తెరకెక్కించారు. పోలీస్‌ అధికారిగా వినోద్‌ ఖన్నా, రెండోవాడు అమితాబ్‌ బచ్చన్‌ మద్యం వ్యాపారిగా, ఇక చిన్నవాడైన రిషి కపూర్‌ అక్బర్‌గా  ఖవ్వాలి గాయకుడిగా నటించి మెప్పించారు. వీరి తల్లిగా అలనాటి నటి నిరూప రాయ్‌ నటించింది. ఆనంద్‌ బక్షి రాసిన గీతాలకు లక్ష్మీకాంత్‌ - ప్యారేలాల్‌ సంగీతం తోడై విజయఢంకా మ్రోగించింది ‘అమర్ అక్బర్‌ ఆంటోని’. నలభైమూడు సంవత్సరాల కిత్రం విడుదలైన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ అలస్తూనే ఉన్నాయి. ఈ సినిమా తరువాత తమిళంలో ‘శంకర్‌ సలీం సైమన్’‌ (1978), తెలుగులో ‘రామ్‌ రాబర్ట్ రహీం’ (1980), మలయాళంలో ‘జాన్‌ జాఫర్‌ జనార్థన్’ ‌(1982)గా అనువాదమై అలరించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.