వెండితెరపై 50 వసంతాల అమితాబ్‌!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ పేరు చెప్పగానే ఓ గౌరవం కలుగుతుంది అభిమానుల మనసుల్లో. అలాంటి నటుడు వెండితెరపై యాభై వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన నటించిన తొలి సినిమా పేరే ‘సాత్‌ హిందుస్థానీ’. ఇది 1969 నవంబర్‌ 7న విడుదలైంది. ఈ సందర్భంగా తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ తన తండ్రి గురించి ట్విట్టర్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో పెట్టి ఆ ఫోటో కింద ..‘‘నేను మీకు పుత్రుడిగానే కాదు, ఒక అభిమానిగా నీ గొప్పతనాన్ని, మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తున్నాను. మీరే మాకు స్ఫూర్తి. మీరు 50 వసంతాలే కాదు మరో యాభై ఏళ్లు ఉండాలి..’’ అంటూ పేర్కొన్నాడు. అమితాబ్‌ ఈ మధ్యనే తెలుగులో వచ్చిన ‘సైరా’లో చిరంజీవి రాజ గురువు గోసాయి వెంకన్నగా పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మాస్తా’లోనూ నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.