ఐశ్వ‌ర్య‌రాయ్‌ కొడు‌కు‌నంటూ.‌.‌.‌
article imageసెల‌బ్రె‌టీ‌లను, రాజ‌కీయ ప్రము‌ఖు‌లను తమ సంతా‌న‌మంటూ ఇరు‌కున పడే‌యడం ఈ మధ్య అల‌వా‌టుగా మారింది.‌ బెంగ‌ళూ‌రుకు చెందిన అమృత సారథి అనే 37 ఏళ్ల యువతి తను దివం‌గత జయ‌ల‌లిత కుమా‌ర్తె‌నని, బెంగ‌ళూ‌రు‌లోని జయ‌ల‌లిత సోదరి శైలజ వద్ద పెరి‌గా‌నని, డిఎన్‌ఏ పరీక్షకు తను సిద్ధ‌మని సుప్రీం కోర్టును ఆశ్రయిం‌చిన సంచ‌ల‌నా‌త్మ‌క‌మైన విషయం తెలి‌సిందే.‌ అలాగే తమిళ సూప‌ర్‌స్టార్‌ ధనుష్‌ తమ కుమా‌రు‌డే‌నని న్యాయ‌పో‌రాటం చేసి ఓడిన దంప‌తుల విషయం కూడా విది‌తమే.‌ ఇప్పుడు ఇలాంటి సంకట స్థితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వ‌ర్య‌రా‌య్‌కి కూడా వచ్చింది.‌ ఆంధ్రప‌ద్రే‌శ్‌కు చెందిన సంగీత కుమార్‌ అనే 29 ఏళ్ల యువ‌కుడు తను ఐశ్వ‌ర్య‌రాయ్‌ కుమా‌రు‌డ‌నని మంగు‌ళూ‌రులో వదం‌తులు లేవ‌దీ‌శాడు.‌ కృతిమ పిండో‌త్పత్తి (ఐవి‌ఎఫ్‌) ద్వారా తను ఐశ్వ‌ర్య‌రా‌య్‌కి 1988లో లండన్‌ నగ‌రంలో జన్మిం‌చా‌నని తెలి‌పాడు.‌ ఐశ్వ‌ర్య‌రాయ్‌ తల్లి‌తం‌డ్రులు తనని రెండే‌ళ్ల‌పాటు పెంచి తర్వాత విశా‌ఖ‌పట్నం దగ్గ‌ర‌లోని చోడ‌వ‌రంలో వది‌లా‌రని ఇతడు చెప్తు‌న్నాడు.‌ తను ఐశ్వ‌ర్యకు జన్మిం‌చిన వాడి‌నే‌నని, కానీ, నిజ‌ని‌ర్ధా‌ర‌ణకు పని‌కి‌వచ్చే రుజు‌వు‌లను తన‌వద్ద ఏమీ లేవని అంటు‌న్నాడు.‌ లండన్‌ నగ‌రంలో పట్టి‌వుంటే జనన ధృవీ‌క‌రణ పత్రం పేరుతో సహా నమో‌ద‌వు‌తుం‌దని, పాస్‌పోర్టు, వీసా వంటివి లేకుండా విశా‌ఖ‌పట్నం ఎలా రాగ‌లి‌గా‌డని సంగీ‌త‌కు‌మార్‌ మీద సన్ని‌హి‌తులు ప్రశ్నలు సంధి‌స్తు‌న్నారు.‌ ఇలా సెల‌బ్రి‌టీ‌లను ఇరు‌కున పెట్టడం, వారి ప్రవ‌ర్త‌న‌మీద బురద చల్లడం ఈ మధ్య కాలంలో ఎక్కు‌వైంది.‌ ఇలాంటి వారిని కఠి‌నంగా శిక్షిం‌చ‌కుంటే, సెల‌బ్రి‌టీ‌లకు ఇటు‌వంటి తల‌నొ‌ప్పులు తప్ప‌వని మీడియా భావి‌స్తోంది.‌ ప్రస్తుతం ఐశ్వ‌ర్య‌రాయ్‌ అతుల్‌ మంజ్రే‌కర్‌ దర్శ‌కత్వం వహి‌స్తున్న ‌‘ఫాన్నే ఖాన్‌’‌ సిని‌మాలో సీని‌యర్‌ నటుడు అని‌ల్‌క‌పూర్‌ సర‌సన నటి‌స్తోంది.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.