అనుష్క దెయ్యంలా.. మారిందిలా!
బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరి’. హారర్‌ నేపథ్యం గల ఈ సినిమాను ప్రోసిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనుష్క పరి, రుక్సానా అనే రెండు పాత్రల్లో నటిస్తున్నారు.

article image
ముఖం నిండా రక్తంతో కూడిన దెయ్యం పాత్రలో కనిపిస్తూ అనుష్క పోస్టర్లు, టీజర్లతో అనుష్క హడలు గొట్టేసింది. ఇలాంటి గెటప్‌లో ఆమె నటించడం ఇదే మొదటిసారి. ‘పరి’ చిత్రం రేపు విడుదల కాబోతోంది. బుధవారం సాయంత్రం సినీ ప్రముఖులకు ప్రీమియర్‌ షో ప్రదర్శించాలనుకున్నారు కానీ దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియల నేపథ్యంలో షోను రద్దు చేశారు.

కాగా..ఈ సినిమాలో తనను దెయ్యంలా ఎలా మార్చారో వివరిస్తూ అనుష్క మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘పరి’ సినిమా కోసం క్లోవర్‌ ఊట్టన్‌ అనే విదేశీ మేకప్‌ ఆర్టిస్ట్‌ను రప్పించారు. ‘పరి’ సినిమాలో మేకప్‌దే కీలక పాత్ర అని అనుష్క వివరించారు. క్రిఆర్జ్‌, క్లీన్‌ స్లేట్‌ ఫిలింస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దీంతో పాటు అనుష్క ‘జీరో’, ‘సూయి ధాగా’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.