బుసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి రెహమాన్‌...

ప్రముఖ కథానాయకులు, దర్శకులు నిర్మాతగా మారటం ఈ రోజుల్లో సాధారణ విషయం అయిపోయింది. వీళ్లకి భిన్నంగా సంగీంతదర్శకుడు ఏ.ఆర్‌.రహమాన్‌ రచయిత, నిర్మాతగా మారటం సినీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. ప్రసుత్తం ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘99 సాంగ్స్‌’. ఈ మూవీకి కథ, సంగీతం కూడా రెహమానే సమకూర్చారు. అక్టోబర్‌ 9న జరిగే బుసాన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘99 సాంగ్స్‌’ సినిమా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ప్రదర్శనకు ముందు జరిగే ప్రత్యేక ప్రత్యేక కార్యక్రమంలో తన చిత్ర బృందాన్ని పరిచయం చేయనున్నారు ఈ సంగీత స్వరకర్త.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.