ఇప్పటికీ జపాన్‌లో థియేటర్లో ఆడుతున్న ‘భజరంగీ భాయ్‌జాన్‌’

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘భజరంగీ భాయ్‌జాన్‌’. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి కథను సమకూర్చింది రాజమౌళి తండ్రి అయిన కె.వి.విజయేంద్ర ప్రసాద్‌. జులై 17, 2015న విడుదలైన ఈసినిమా ఇప్పటికీ జపాన్‌ థియేటర్లో ఆడుతూనే ఉంది. ఇదే విషయాన్ని చిత్ర దర్శకనిర్మాత కబీర్‌ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌గా షేర్‌ చేశారు. ‘‘మా హృదయాల నుంచి వచ్చిన ‘భజరంగి భాయ్‌జాన్‌’పై మీరు చూపిన అపుర్వమైన ప్రేమకు మాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. మీ అందరికి ధన్యవాదాలు. సినిమా విడుదలై ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటికీ జపాన్‌లోని కొన్ని థియేటర్లో ప్రదర్శితం అవుతుందని’’ పేర్కొన్నారు. ఇందులో కరీనా కపూర్‌, నవాజుద్దీన్ సిద్దిఖీ, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. చిత్రకథేంటంటే మూగ అమ్మాయి షాహిదా (హర్షాలీ మల్హోత్రా) పాకిస్తాన్‌లోని సుల్తాన్‌పూర్‌ అనే గ్రామంలో తల్లితండ్రులతో కలిసి ఉంటుంది. కొండల మధ్య అందమైన ఈ ఊరిలో ఉన్న ఈ అమ్మాయికి ఓ ప్రమాదంలో నోరు మూగపోతుంది. దాంతో ఆమె తల్లి రసియా ధిల్లీలోని నిజాముద్దీన్‌ అలియా మందిరానికి తీసుకెళ్లాని అనుకుంటుంది. అక్కడి వెళ్తే మాటలు వస్తాయనే ఆశతో. ఇండియాకి వచ్చి తిరిగి రైలులో ఇంటికి వెళ్లేటప్పుడు షాహిదా గొర్రె పిల్లను కాపాడాటానికి కిందికి దిగుతోంది. దీంతో రైలు వెళ్లిపోతుంది. ఆ తరువాత భయపడి ఓ గూడ్స్ రైల్లో కురుక్షేత్రకి చేరుతుంది. అక్కడ పవన్‌ కుమార్‌ (సల్మాన్‌ఖాన్‌) ఆంజనేయభక్తుడు, పెళ్లి కాని బ్రహ్మణుడుకి కనిపిస్తుంది. దాంతో ఆ చిన్న అమ్మాయిని తీసుకొని తన తండ్రి స్నేహితుడు దయానంద్‌ పాండే రసిక (కరీనా కపూర్‌) తండ్రి ఇంట్లోనే ఉంటాడు. రసికతో అతనికి నిశ్చితార్థం కూడా జరుగుతోంది. అయితే షాహిదాను తన సొంతవాళ్ల దగ్గరకి పంపించడానికి పవన్‌ చేసిన ప్రయత్నాలేంటి ఆ అమ్మాయి తన తల్లితండ్రుల దగ్గరకు చేరిందా లేదా అనేది మిగతా కథ.

View this post on Instagram

A post shared by Kabir Khan (@kabirkhankk) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.