అరుదైన ఘనత సాధించిన ‘బాలా’

బాలీవుడ్‌ ‘బాలా’ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. బెర్లిన్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఇండో జర్మన్‌ ఫిల్మ్‌వీక్‌- 2020’లో ఈ రోజు (సెప్టెంబరు 27) ‘బాలా’ ప్రదర్శితంకానుంది. ఈ విషయాన్ని ప్రముఖ చిత్ర విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. బట్టతలతో బాధపడే ప్రేమికుడిగా ఆయుష్మాన్‌ తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. భూమి పెడ్నేకర్, యామీ గౌతమ్‌ నాయికలు. 2019లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించగా దినేష్‌ విజన్‌ నిర్మించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.