బాలీవుడ్‌ తారల సాయం!
కరోనా వైరస్‌ విపత్తును ఎదుర్కోడానికి సినీ ప్రముఖులు విరాళాలను వెల్లువలా అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన నటీనటులు అనుష్క శర్మ, కార్తిక్‌ ఆర్యన్, రాజ్‌కుమార్‌ రావ్‌లు తమవంతు బాధ్యతగా విరాళాలు ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.

* అనుష్క శర్మ: ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మా మద్దతును ప్రకటిస్తున్నాము. ప్రజల బాధలను చూసి మా హృదయాలు బరువెక్కాయి. తోటి పౌరులుగా మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తాం’’.* కార్తీక్‌ ఆర్యన్‌: ‘‘ఒకదేశ పౌరుడిగా అందరు కలిసి ఎదగడం ఎంతో అవసరం. నేను సంపాదించిన డబ్బును తిరిగి ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేందుకు ప్రధాని సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నా. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత సహాయం చేయమని అందరిని కోరుతున్నా’’.

* రాజ్‌ కుమార్‌ రావ్‌: ‘‘కరోనా వైరస్‌కి వ్యతిరేక పోరాటంలో కలిసి నిలబడడానికి ఇదే మనకు సరైన సమయం. నాకు మటుకు పేదవారిని ఆదుకునేందుకు విరాళం ఇచ్చాను. మీరు కూడా మీ బాధ్యతగా, ఎలాంటి సాయమైనా, మద్దతును తెలియజేయండి. మన దేశం కోసం మనకోసం. జైహింద్‌’’.* ఆయుష్మాన్‌ ఖురానా: ‘‘ఇప్పుడున్నది కష్టకాలం. తోటి పౌరుల కష్టాల్ని తీర్చడానికి మనం మద్దతు ఇవ్వాలి’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.