ఇక చాలు... ఆపండి: ఆరాధ్య

సెలబ్రిటీలు కనబడడటమే తడవు క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌ మనిపిస్తారు. ఇక సెలబ్రిటీస్‌ పిల్లలతో కలసి కనిపిస్తే మరిన్ని మెరుపులు మెరుస్తాయి. ఇటీవల అంబానీ ఇంట పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో ఐశ్వర్య, అభిషేక్‌లతో పాటు వారి కుమార్తె ఆరాధ్య కూడా పాల్గొంది. వీరిని చూసిన ఫోటో గ్రాఫర్లు వివిధ భంగిమల్లో ఫోటోలు తీశారు. ఈ హడావుడి ఆరాధ్యకు నచ్చలేదు. ఫొటోగ్రాఫర్లకు క్యూట్‌గా కౌంటర్‌ ఇచ్చింది. స్టేజ్‌ దిగుతున్నప్పుడు కూడా ఫొటోలు తీయడంతో ‘ఇక చాలు.. ఆపేయండి’ అంటూ ఆరాధ్య స్పందించింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ వీడియోను ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.