‘చపాక్‌’ నుంచి లీకైన ముద్దుసీన్‌

దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చపాక్‌’. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథతో రూపొందిస్తున్న చిత్రమిది. విక్రాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా తరచూ లీక్‌ల బారిన పడుతోంది. ఇటీవలే దీపిక స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న వీడియో ఒకటి బయటకు రాగా.. తాజాగా సినిమాలోని కీలకమైన ఓ ముద్దు సన్నివేశం బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా దిల్లీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనిలో భాగంగా ఓ బిల్డింగ్‌పై కూర్చోని విక్రాంత్‌ - దీపిక ముద్దు పెట్టుకున్న సీన్‌ను తెరకెక్కించారు. దీన్ని చుట్టు పక్కల ఉన్న కొందరు వ్యక్తులు సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో.. ఇప్పుడది కాస్త నెట్టింట వైరల్‌ అయింది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2020 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.


View this post on Instagram

A post shared by Trendy Tiding (@trendytiding) on

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukonepic) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.