‘చేహరే’లో అమితాబ్‌ ఇలా

వైవిధ్యమైన చిత్రాలతో ముందుకెళుతున్న అమితాబ్‌బచ్చన్‌ నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘చేహరే’. థ్రిల్లర్‌ కథాంశంతో సాగే ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ మరో కీలక పాత్రధారి. ఈ చిత్రంలో అమితాబ్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నెరిసిన గుబురు గెడ్డంతో ఉన్న అమితాబ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. అమితాబ్‌, ఇమ్రాన్‌ హష్మీ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ విషయంలో ఇమ్రాన్‌ చాలా సంతోషంగా ఉన్నారు. ‘‘అసలు మా కలయికను ఊహించలేదు. ఎంతో ఆనందంగా ఉంది. 46 ఏళ్ల క్రితం ‘జంజీర్‌’లో మా నానమ్మ అమితాబ్‌కు తల్లిగా నటించారు’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఇమ్రాన్‌. రూమీ జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.