చైనాలో దుమ్మురేపిన ‘మామ్‌’

రవి ఉద్యావర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మామ్‌’. 2017లో విడులైన ఈ క్రైమ్‌ థిల్లర్‌లో శ్రీదేవి కథానాయిక. నవాజుద్దీన్‌ సిద్దిఖీ కీలకపాత్రలో పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా(చైనా మినహా) నాలుగు భాషల్లో విడుదలై భారీ వసూళ్లను సాధించింది. జాతీయ స్థాయి అవార్డులను సాధించింది. తాజాగా ఈ సినిమా మార్చి 22న చైనాలో విడుదలై రూ.11.47 కోట్ల వసూళ్లను (గురువారం నాటికి) సాధించింది. 38,500 స్క్రీన్లపై చైనాలో ఈ సినిమాను ప్రదర్శించారు. గతంలో ఇక్కడ విడుదలైన సినిమా ‘అంథాధున్‌’ భారీ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు శ్రీదేవి నటించిన ‘మామ్‌’ ఈ రికార్డును బ్రేక్‌ చేసింది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.