జనతా కర్ఫ్యూకి బాలీవుడ్‌ ‘సై’

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు బాలీవుడ్‌ తారలు మద్దతు ప్రకటించారు. అక్షయ్‌ కుమార్, శిల్పాశెట్టి, అజయ్‌ దేవగన్‌ సహా పలువురు తారలు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. మద్దతను ప్రకటించారు. అక్షయ్‌ కుమార్‌ ట్విట్టర్లో ‘‘ప్రధాని చేసిన ప్రసంగం అందరిని మేల్కోనేలా చేసింది. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించి మన దేశాన్ని రక్షించుకుందాం’’ అని పేర్కొన్నాడు. మరో నటుడు అజయ్‌ దేవగణ్‌ ‘‘నా అభిమానులంతా ప్రధాని సూచించిన విధంగా అందరూ ఇంటి వద్దనే ఉండాని’’ కోరాడు. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ‘‘గౌరవనీయులైన ప్రధాని చేసిన ప్రసంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు తూచ తప్పకుండా స్వీయ నిర్బంధాన్ని బాధ్యతతో పాటించాలి. జైహింద్‌’’ అంటూ నినదించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.