రామాయణం ఎప్పటికీ నిత్యనూతనమే అంటోన్న చిఖాలియా!

‘‘రామాయణం శాశ్వతమైనది. భక్తి, ప్రేమను ఏదీ అంతం చేయలేదు’’ అని చెబుతోంది నాటి రామాయణ్‌ సీరియల్‌ నటి దీపిక చిఖాలియా. లాక్‌డౌన్‌ కారణంగా డీడీ నేషనల్‌ ఛానెల్‌ 1987లో ప్రసారమైన నాటి ‘రామాయణ్‌’ సీరియల్‌ని మళ్లీ దూరదర్శన్‌లో పునః ప్రారంభం చేశారు. ఇప్పటికే రామయణ్‌ సీరియల్‌ అనే రికార్డులను బద్దలు కొట్టి బార్క్‌ జాబితాలో అగ్రసానాన్ని సంపాదింకుంది. ఈ సందర్భంగా నాటి సీత పాత్రలో నటించిన నటి దీపిక ఛిఖాలియా మాట్లాడుతూ..‘‘అప్పట్లో ప్రసారమైనప్పుడు చాలామంది విచిత్రంగా మాట్లాడారు. కొంతమంది ఎగతాళి కూడా చేశారు. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం ‘మీరంటే మా అమ్మగారికి చాలా ఇష్టం..మా తాతలు, అత్తలు మీ అభిమానలంటూ’’ చెప్తున్నారు. మొత్తంగా చూస్తే అప్పుడు నవ్వినవాళ్లు ఇప్పుడు ఏమంటారు. ఈతరం వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే. రామాయణం వినోదం కాదు. ఇది చూసిన వాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇలా మరోసారి రామాయణ్‌ పునః ప్రారంభం కావడం చాలా ఆనందం. ప్రజలు మమ్మల్ని మళ్లీ గుర్తుపడుతున్నారు. అంతేకాదు ప్రజలంతా కలిసి మాకు రాయాల్టీ ఇప్పించాలి. ఇప్పుడందరూ ఇంట్లో కూర్చుని రామాయణ్‌ చూస్తున్నారంటే? అందుకు కారణం మా చిత్రబృందమే కారణం. ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు రాయాల్టి ఇప్పంచాలని కోరుకుంటన్నాను’’ అంటోంది. దివంగత దర్శకుడు రామానందసాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘రామాయణ్‌’ సీరియల్లో రాముడిగా అరుణ్‌ గోవిల్, లక్ష్మణుడిగా సునీల్‌ లాహ్రీలు నటించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.