ధనుష్‌ - సారాల కొత్త చిత్రం!

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక,నిర్మాత ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ప్రస్తుతం ‘శుబ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం తరువాత తన దర్శకత్వంలో ధనుష్, సారా అలీఖాన్‌తో కలిసి ఓ కొత్త చిత్రం తెరకెక్కింàనున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా నటించనున్నాడని సమాచారం. అయితే అక్షయ్‌ కూడా పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారట. అయితే పూర్తిస్థాయిలో కాదట అథిగా మాత్రమేనట. ఇక ఆనంద్‌ ఇప్పటికే గత ఏడాదికి ముందు షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ‘జీరో’ చిత్రానికి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. కానీ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తాపడింది. అందుకే ఆనంద్‌ అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహిస్తున్నాడట. ఇప్పటికే తాప్సీ ప్రధాన పాత్రలో వస్తున్న ‘హసీన్‌ దిల్‌రూబా’ అనే చిత్రాన్ని తన ఎల్లో కలర్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇక సారా అలీఖాన్‌ డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో ‘కూలీ నెం.1’లో నటిస్తుండగా, ధనుష్‌ తమిళంలో ‘సురులి’లో అనే చిత్రం చేస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.