మొదటి చిత్రమే ప్రేమకు నాంది..

బాలీవుడ్‌ చిత్రసీమలో కొన్ని యాదృచ్చికంగా జరుగుతుంటాయి. అలా జరిగిన సంఘటనే వారిద్దరిని కలిపింది. ఆ జంటే జెనీలియా - రితేష్‌ దేశ్‌ముఖ్‌. సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం ప్రేమకథా నేపథ్యంలో తెరపైకి వచ్చిన చిత్రం ‘తుజే మేరి కసమ్‌’. ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై రామోజీరావు నిర్మాతగా, కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 3, 2003లో విడుదలై మంచి ఫలితాన్నే రాబట్టింది. ఈ చిత్రం గురించి అప్పటి హీరోహీరోయిన్‌, ఇప్పటి బాలీవుడ్‌ దంపతులు రితేష్‌ - జెనీలియాలు తమ గతాన్ని మరొకసారి గుర్తు చేసుకొన్నారు. ఈ చిత్రం 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెనీలియా ఇన్‌స్టాగ్రామ్‌ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియాకు..ఇది నా మొదటి చిత్రం నా హృదయాన్ని కదిలిచింది..అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించింది. రితేష్‌ - జెనీలియా దంపతులు 2017లో ప్రేమ పెళ్లి చేసుకొన్నారు. వీరికి రియాన్‌, రాహిల్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.