బెర్లిన్‌లో గల్లీబాయ్‌

ము
రికి వాడల్లో పెరిగిన ఓ కుర్రాడు దేశం గర్వించే ర్యాప్‌ గాయకుడిగా ఎదిగిన కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గల్లీబాయ్‌’. రణ్‌వీర్‌సింగ్‌, ఆలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జోయా అక్తర్‌ దర్శకత్వంలో రితేష్‌ సిద్వాని నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని బెర్లిన్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రితేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ ఫొటోలను పంచుకున్నారు. అక్కడ రెడ్‌ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది ఆలియాభట్‌. ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.