‘హేరా ఫేరి3’ కచ్చితంగా వస్తోంది!

బాలీవుడ్‌ చిత్రం ‘హేరా ఫేరి’ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్షయ్‌ కుమార్, పరేష్‌ రావల్, సునీల్‌ శెట్టిల నటన. 2000 సంవత్సరంలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో హాస్యచిత్రంగా వచ్చిన ‘హేరా ఫేరి’ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఆ తరువాత 2006లో నీరజ్‌ వోరా దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీ నేపథ్యంగా వచ్చిన ‘ఫిర్‌ హేరా ఫేరి’ మరింతగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాలకు సీక్వెల్‌గా ‘హేరా ఫేరి3’ని కచ్చితంగా తెరకెక్కిస్తామని చిత్ర నటుల్లో ఒకరైన సునీల్‌ శెట్టి ఓ ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. సీక్వెల్‌గా రానున్న ఈ సినిమానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించనున్నారట. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రియదర్శన్‌ ‘హంగామా2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శిల్పాశెట్టి, పరేష్‌ రావల్, ప్రణీత, మీజాన్‌ జాఫ్రీలు నటిస్తున్నారు. చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14, 2020న తెరపైకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.